Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్ సిబ్బందిపై దాడి చేస్తే పదేళ్ల జైలు

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (19:46 IST)
దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తీవ్రస్థాయి చర్యలు ప్రతిపాదిస్తోంది. ఆస్పత్రుల్లో.. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది లేక ఏ ఇతర విభాగ సిబ్బందిపైనైనా దాడిచేసిన వారు ఇక కఠిన దండన ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు. హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తేనుంది. 30 రోజులలోపు ప్రజల అభిప్రాయాలు తెలపాలంటూ బిల్లు ముసాయిదాను ఆన్‌లైన్లో ఉంచింది. ఈ బిల్లు ప్రకారం..
 
ఓ డాక్టరు లేదా నర్సు లేదా ఇతర వైద్య సిబ్బందిని కొడితే కనీసం ఆరు నెలల జైలు శిక్ష
గాయపరిచినా, హింసించినా
- దాని స్థాయిని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్ల దాకా ఖైదు తప్పదు. కేవలం జైలే కాదు… కనీసం రూ 5వేల నుంచి రూ 5 లక్షల దాకా జరిమానా కూడా విధించవచ్చు.
- వైకల్యం లేదా కోలుకోలేని స్థితి తెచ్చినా, లేక చంపేసినా 10 సంవత్సరాల కఠిన కారాగారవాసం.
- కేసు తీవ్రతను బట్టి రూ 10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు
- నేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా కేవలం ఓ చిన్న కాగితం మీద బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు
- సీఆర్‌పీసీతో సంబంధం లేకుండా ఎకాయెకిన అరెస్టు చేయవచ్చు, చేసిన నేరానికి బెయిల్‌ కూడా ఇవ్వరు
- డీఎస్పీ ర్యాంకు అధికారి కేసు నమోదు, దర్యాప్తు చేపట్టాలి. ఆస్తినష్టానికి తెగబడితే నష్ట పరిహారం భారీగా వసూలతో పాటు మూడు నుంచి ఐదేళ్లు పాటు జైలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments