Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్‌కు కరోనా : తెలంగాణాలో కొత్తగా 6 వేల కేసులు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:31 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరోనా వైరస్ బారినపడ్డారు. పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మంత్రి కేటీఆర్ తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. 
 
అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
 
గురువారం ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. 24 గంటల్లో 1,005 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్‌ 406, మహబూబ్‌నగర్‌ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments