Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింకులు పంపారు.. క్లిక్ చేయగానే.. ఖాతాలోని డబ్బును ఊడ్చేశారు...

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:03 IST)
సైబర్ నేరగాళ్లు సరికొత్త టెక్నిక్స్‌తో బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు. దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. మీరు గిఫ్ట్ ఓచర్లు గెలుచుకున్నారంటూ కొన్ని లింకులు పంపించారు. ఇది నిజమేనని నమ్మి క్లిక్ చేసిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 74 వేల రూపాయలను ఊడ్చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆ మహిళ లబోదిబో మంటోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ కవాడిగూడకు చెందిన ప్రియాంక అనే మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీరు కొన్ని బహుమతులు గెలుచుకున్నట్టు నమ్మించారు. వీటిని తీసుకోవాలంటే ఈ ఫారాలు నింపాలని, జీఎస్టీ, అమేజాన్‌ చార్జీలు చెల్లించాలంటూ చెప్పడంతో ఆమె నిజమని నమ్మింది. 
 
ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా కొన్ని లింకులు పంపించారు. ఆమె ఆ లింకులను క్లిక్‌ చేస్తూ అందులో వివరాలు నింపుతూ వెళ్లింది. అందులో బ్యాంకుకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సైబర్‌నేరగాళ్లు ఆమె ఖాతాలో నుంచి రూ.74 వేలు మాయం చేశారు. ఆ తర్వాత మొబైల్ నంబరుకు రూ.74 వేలు విత్‌డ్రా చేసినట్టు సందేశం రావడంతో అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ... లబోదిబో మంటోంది. 
 
అలాగే, మరో మహిళా ఉద్యోగిని కూడా ఇదే విధంగా మోసపోయింది. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదు తెలుసుకోడానికి బ్యాంకు నుంచి గిఫ్ట్‌ హోచర్లు పంపిస్తున్నామంటూ కొన్ని లింకులు పంపించారు. అది నిజమని నమ్మిన ప్రైవేట్‌ ఉద్యోగిని రజని ఆ లింకులు ఓపెన్‌ చేసింది. దీంతో ఆమె ఖాతాలలో నుంచి రూ.80 వేలు కాజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments