Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్‌ స్వాపింగ్‌?... తాజాగా రూ.86 లక్షల మోసం!

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (11:13 IST)
ఇటీవలికాలంలో సైబర్ నేరగాళ్లు చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. రోజుకో కొత్త టెక్నిక్‌తో బ్యాంకు ఖాతాదారులను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో సిమ్‌ స్వాపింగ్‌తో రూ.86 లక్షలు దోచుకుని, డబ్బును బిట్‌ కాయిన్స్‌ రూపంలో నైజీరియాకు పంపుతూ ఓ ముఠా పట్టుబడింది. ఈ క్రమంలో అస్సలు స్విమ్ స్వాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. 
 
వైరస్‌తో కూడిన లింక్‌ను సృష్టించి.. దాన్ని వేలాది మందికి మెయిల్స్‌, వాట్సాప్‌, ఎస్సెమ్మెస్‌గా పంపిస్తారు. తెలియకుండా దానిని క్లిక్‌ చేయడం ద్వారా వైరస్‌ మన ఫోన్‌, కంప్యూటరలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్‌ స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌లో జరిగే లావాదేవీలన్నింటినీ సైబర్‌ నేరగాళ్లకు చూపుతుంది. 
 
ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను వారు పరిశీలిస్తారు. మెయిల్స్‌తోపాటు ఫోన్‌ నంబర్ల వివరాలను సేకరిస్తారు. తమ ఏజెంట్ల ద్వారా సిమ్‌కార్డ్స్‌ అవుట్‌లెట్‌లో కొత్త సిమ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయిస్తారు. బాధితుడికి తెలియకుండానే ఫోన్‌ డిస్‌‌కనెక్ట్‌ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించేలోపే ఖాతా ఖాళీ అయిపోతుంది.
 
తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ముఠా సిమ్ స్వాపింగ్ ద్వారా ఏకంగా 86 లక్షల రూపాయలను స్వాహా చేసిన మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మోసంపై నగర జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి వివరాలు వెల్లడిస్తూ, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి డీసీబీ బ్యాంకులో మూడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలుండగా.. అవన్నీ తన మెయిల్‌, మొబైల్‌నంబర్‌కు లింక్‌ చేసి ఉన్నాయి. 
 
గత నెల 5 నుంచి మొబైల్‌ నంబర్‌ పనిచేయలేదు. 20వ తేదీన నంబర్‌ను రీ యాక్టివేట్‌ చేయించగా.. ఓటీపీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ ఏకధాటిగా వచ్చాయి. అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి ఖాతాల్లో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోగా.. ఈ మూడు ఖాతాల నుంచి దాదాపు రూ.50 లక్షలు బదిలీ అయ్యాయని తేలింది. 
 
వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో మరో వ్యాపారి రూ.36 లక్షలు కోల్పోయాడు. సిమ్‌ స్వాపింగ్‌తో మోసం జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాధితుల ఖాతాల నుంచి బదిలీ అయిన అకౌంట్ల వివరాలు సేకరించారు. 
 
ఈ కేసులో కోల్‌కతాకు చెందిన సాగర్‌మహతో, కుమార్‌గౌరవ్‌సింగ్‌, సంజయ్‌ అగర్వాల్‌ను ట్రాన్సిట్‌ వారెంట్ల మీద అరెస్టు చేశారు. ఇదే తరహాలో సిమ్‌స్వాపింగ్‌తో ముంబైకి చెందిన వ్యాపారి ఖాతా నుంచి రూ 2 కోట్లు కొట్టేసినట్టు సంజయ్‌ మహతో అంగీకరించాడు. 
 
ఈ ముఠాకు నాయకుడు నైజీరియాకు చెందిన షెడ్రిక్‌పాల్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా తమ ఖాతాలకు వచ్చిన నగదును 20 శాతం కమీషన్‌గా తీసుకొని బిట్‌కాయిన్‌ రూపంలో షెడ్రిక్‌కు పంపుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments