Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురికి జీవదానం చేసిన వివాహిత... ఎలా?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:47 IST)
ఓ వివాహిత నలుగురి ప్రాణదానం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ వివాహిత అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో నలుగురు ప్రాణదానం పొందారు. మృతురాలి పేరు గండ్ర హరిత (26). తాను చనిపోతూ నలుగురికి పునర్జన్మ ఇచ్చింది. 
 
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గండ్ర హరిత భర్తతో కలిసి హైదరాబాద్ నగరంలో తన భర్తతో కలిసి ఉంటున్నారు. ఈమె భర్త యశ్వంత్ రెడ్డి హైదరాబాద్ నగరలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు పది నెలలో చిన్నారి కూడా ఉంది. 
 
ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి తలనొప్పింగా ఉందని చెప్పి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. 
 
జీవన్ దాన్ ప్రతినిధులు హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో హరిత కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు, నేత్రాలు సేకరించిన వైద్యులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో నలుగురికి అమర్చారు. దీంతో హరిత చనిపోయినప్పటికీ.. ఆ నలుగురి రూపంలో ఆమె బతికే ఉంటుందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments