Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిళకు ఊరట కలిగించిన తెలంగాణ హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (14:16 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న షరతు విధించింది. అలాగే రెండు ష్యూరిటీలు, రూ.30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 
 
కాగా, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సోమవారం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేసమయంలో ఆమె బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారమే వాదనలు పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం మంగళవారం వెలువరించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
అయితే, పోలీసులపై షర్మళ చేయి చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పేర్కొన్నారు. షర్మిళ తరపు న్యాయవాదులు వాదిస్తూ ఆమెను పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతిస్పందించారని చెప్పారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments