Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతన్యపురిలో దారుణం : ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (09:22 IST)
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇస్తానని ఫోన్ చేసి నమ్మించిన సిద్ధార్థ్ రెడ్డి అనే కామాంధుడు.. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 9వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌కు వచ్చి ఎస్సార్ నగర్‌కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా, ఆ యువతి పేరుతోనే లాడ్జీలో గదిని బుక్ చేసుకుని అత్యాచారం చేయడమేకాకుండా, ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన 19 యేళ్ల యువతి నాలుగేళ్లుగా దిల్‌సుఖ్ నగర్‌లోని చైతన్యపురి కాలనీలో ఉంటూ టెలీకాలర్‌గా పని చేస్తుంది. ఈ నెల 7వ తేదీన సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఆెకు ఫోన్ చేసి తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, నెలకు రూ.18 వేల జీతం ఇస్తానని  నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆ యువతి ఉద్యోగానికి అంగీకరించింది. 
 
ఈ నెల 9వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌కు వచ్చి సిద్ధార్థ్ రెడ్డి (23) ఆ యువతిని ఎక్కించుకుని యర్రగడ్డకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె గుర్తింపు కార్డులు, ఫోటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎస్సార్ నగర్‌లోని ఓ లాడ్జీలో ఆ యువతి పేరుతో రూమ్ బుక్ చేశాడు. దీంతో భయపడిన ఆ యువతి అతన్ని నిలదీసింది. అయితే, రాత్రి భోజన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని, అడ్వాన్స్ కూడా ఇస్తానని నమ్మించాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. అయితే, ఆ కామాంధుడు నుంచి తప్పించుకున్న యువతి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి ఆ తర్వాత చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్సార్ నగర్ స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments