Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలితో అక్రమ సంబంధం... మాంసం కోసే కత్తితో గొంతుకోసి హత్య

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (12:49 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని.. యువతి తండ్రి, సోదరుడు కలిసి అతి క్రూరంగా చేశారు. ఈ ఘటన హైదరాబాద్ కంచన్‌బాగ్ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ మునావర్ (27) అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు హఫీజ్ బాబా నగర్‌కు చెందిన 25 యేళ్ళ యువతితో ఐదేళ్ళ క్రితం వివాహం జరుగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
ఈ క్రమంలో భార్య సోదరి అంటే మరదలితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భార్య, అతడి కుటుంబ సభ్యులు పలుమార్లు నిలదీసి మందలించారు. అయినప్పటికీ తీరుమార్చుకోని సయ్యద్... రెండు నెలల క్రితం భార్య సోదరితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ తన సంబంధాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
 
పెద్ద కుమార్తె జీవితాన్ని నాశనం చేస్తూ, చిన్న కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని యువతి తండ్రి ఖాద్రి, తమ్ముడు జీర్ణించుకోలేక పోయారు. దీంతో అల్లుడుని చర్చల పేరుతో ఇంటికి పిలిచి.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, సయ్యద్ మాత్రం మాట వినిలేదు. 
 
ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఖాద్రిని పట్టుకుని కాళ్లు, చేతులను కట్టేశారు. అనంతరం నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మాంసం కోసే కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. దీనిపై స్థానిక పోలీలుసు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments