హైదరాబాద్‌లో టెక్కీ దారుణ హత్య.. సెల్లార్‌లో మాటువేసి కత్తులతో నరికేశారు...

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (09:16 IST)
హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ఆయన భార్య తరపు బంధువులకు సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ హత్య అమీర్‌పేట్‌లోని ధరమ్ కరణ్ రోడ్డు ఆ టెక్కీ ఉంటున్న అపార్టుమెంట్లోనే జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్ (25), మచిలీపట్టణానికి చెందిన లక్ష్మీగౌరి (22) భార్యాభర్తలు. గతేడాది ఫిబ్రవరి 23న వీరికి వివాహమైంది. 
 
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు ఆల్విన్ కాలినీలో భార్యతో కలిసి జీవిస్తుండగా, ఈ యేడాది జూన్ 1న లక్ష్మీగౌరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
భర్త, అత్తమామల వేధింపుల వల్లే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చాడు. 
 
దాంతో రాజు ప్రతి వారం బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండడంతో గత 40 రోజులుగా ధరమ్ కరణ్ రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లో నివసించే మేనమామ వద్ద ఉంటున్నాడు.
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు చికెన్ కోసం అపార్ట్‌మెంట్‌ నుంచి కిందికి వచ్చాడు. అక్కడి సెల్లార్‌లో అప్పటికే మాటువేసిన నలుగురు నిందితులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యవెనక చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీగౌరి బంధువుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments