Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంటీ.. నేనో ఆడపిల్లను.. ఆ ఫోటోలు అజయ్ సెల్‌లోనే ఉన్నాయ్.. టెక్కీ శ్వేత

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:00 IST)
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు శ్వేత తన ప్రియుడు అజయ్ తల్లితో సోదరితో ఫోనులో మాట్లాడింది. తన మనసులోని బాధను వారికి చెప్పుకుని బోరుమని ఏడ్చింది. 
 
ఆంటీ... తానో ఆడ పిల్లనని, ఆ ఫొటోలు అజయ్ దగ్గర తప్ప మరెవరి వద్దా లేవని శ్వేత వేడుకుంటుంటే, తన కుమారుడు అటువంటి వాడు కాదని, ఆ చిత్రాలు మరెవరి నుంచో బయటకు వచ్చుంటాయని అజయ్ తల్లి చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 
 
తన బిడ్డ చాలా మంచివాడని, అలాంటి ఫొటోలను బయటకు తెచ్చి పరువు తీసే రకం కాదని అజయ్ తల్లి చెబుతుంటే, ఆ ఫొటోలు అజయ్ సెల్ ఫోనులో తప్ప ఇంకెక్కడా లేవని శ్వేత వాపోయింది. 
 
కాగా, గత నెల 18వ తేదీన ఇంటి నుంచి మాయమైన శ్వేత, ఆ తర్వాత రోజు బీబీనగర్ సమీపంలోని ఎన్ఎఫ్‌సీ నగర్ వద్ద రైలు పట్టాలపై మృతదేహంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజా ఆడియో బహిర్గతం కావడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు అయింది. 
 
తన వ్యక్తిగత చిత్రాలు అజయ్ సెల్ ఫోన్లో ఉన్నాయని శ్వేత చెబుతుండగా, దానితో తనకు సంబంధం లేదని, ఇటీవలే తాము పొట్టకూటి కోసం వచ్చామని అజయ్ తల్లి సర్ది చెబుతోంది. ఏదైనా ఉంటే తను వచ్చినప్పుడు చెప్పాలని కోరింది. 
 
ఇదిలావుంటే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అజయ్‌ని పోలీసులు ప్రశ్నించగా, శ్వేతతో కలిసి ఉన్న వ్యక్తిగత చిత్రాలను తానే స్వయంగా సోషల్ మీడియాలో అప్‌‌లోడ్ చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం. తాను చిత్రాలను పెట్టిన తర్వాత తనపై కేసు పెట్టారని, అందుకే ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించానని అజయ్ వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments