నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి వేరొక అమ్మాయితో.. కేసీఆర్ డ్రైవర్‌పై దాడి

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:54 IST)
తనను నిశ్చితార్థం చేసుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ డ్రైవర్‌పై ఓ యువతి కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామానికి చెందిన శశికుమార్ .. కానిస్టేబుల్. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాన్వాయ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే అతనికి 2019 నవంబరు నెలలో హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. అనంతరం రూ.5 లక్షల కట్నం కోసం ఒప్పందం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని శశికుమార్‌.
 
దీంతో బాధితురాలు.. హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీసు ఠాణా, నాగర్‌ కర్నూల్‌ పోలీసు ఠాణాలలో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. 
 
తాజాగా శశికుమార్‌ పై బాధితురాలు ఫిర్యాదు మేరకు కుల్సుంపురా పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ పి.శంకర్‌ పర్యవేక్షణలో ఎస్సై శేఖర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments