Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌పై కాల్పులు - హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో అలెర్ట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (09:11 IST)
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... ఢిల్లీకి తిరిగి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. ముందుస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
 
పాతబస్తీ, చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. అదుబాటులో ఉన్న క్విక్ యాక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ బలగాలను రంగంలోకిదించారు. అలాగే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments