Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరుమురిమి మంగలం మీద పడటం అంటే ఇదే కాబోలు...

Webdunia
గురువారం, 21 మే 2020 (09:17 IST)
'ఉరుమురిమి మంగలం మీద పడటం' అంటే ఇదే కాబోలు... కట్టుకున్న భార్యకు కరోనా వైరస్ సోకిందనీ ఓ వ్యక్తి చేసిన హంగామా అంతాఇంతా కాలేదు. అంతటితో ఆగని ఆ వ్యక్తి.. ఏకంగా వీధుల్లో నిలిపివున్న వాహనాలకు నిప్పుపెట్టాడు. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో పాజిటివ్ అని తేలింది. ఈ విషయం ఆ వివాహిత భర్తకు తెలిసింది. అంతే... భార్యకు కరోనా వైరస్ సోకడాన్ని ఏమాత్రం తట్టుకోలేక పోయారు. 
 
వీధిలో నానా హంగామా సృష్టించాడు. ఆపై తన స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి బాపూనగర్‌లోని ఓషాపులో పీకల వరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత రెండు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోకు నిప్పుపెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments