Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూల్స్ బేఖాతర్ : భాగ్యనగరి రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు

రూల్స్ బేఖాతర్ : భాగ్యనగరి రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు
, బుధవారం, 20 మే 2020 (10:32 IST)
హైదరాబాద్ నగర రహదారులపై వాహనాల రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా, 60 రోజుల లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ నగరంలో వాహన రాకపోకలు యధావిధిగా చేరుకున్నాయి. కరోనా వైరస్ సోకుతుందన్న భయం ఏమాత్రం లేకపోవడంతో నగర వాసులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అలాగే, నగర వ్యాప్తంగా ఉన్న షాపులన్నీ యధావిధిగా తెరుచుకున్నాయి. 
 
లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, బారికేడ్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. దీంతో ప్రజలు ఏ మాత్రం కరోనాపై భయం లేకుండా, తమతమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి. అయితే, మాల్స్, థియేటర్లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇవి మాత్ర మూతపడివున్నాయి. 
 
ఒక్కసారిగా వేల సంఖ్యలో కార్లు, బైక్‌లు రోడ్లపైకి రావడంతో అన్ని సిగ్నల్స్ వద్దా ట్రాఫిక్ భారీగా కనిపిస్తోంది. ఇక పోలీసులు అన్ని ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించడం తప్పనిసరని, మాస్క్ లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. 
 
ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని, సాయంత్రం 7 గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తర్వాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో 50 మంది వలస కార్మికులకు కరోనా- 24గంటల్లో రికార్డ్