మహిళతో సహజీవనం... చెప్పినట్టు వినకపోతే నీతో గడిపిన వీడియోలు లీక్ చేస్తా...

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (09:32 IST)
హైదరాబాద్ నగరంలో మరో మహిళ ప్రేమ పేరుతో మోసపోయింది. ఒంటరిగా ఉన్న ఈ మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి... ప్రేమ, సహజీవనం, పెళ్లి అంటూ మోసం చేశాడు. చివరకు తాను చెప్పినట్టు వినకపోతే... నీతో గడిపిన వీడియోలను లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె సైదాబాద్‌ ప్రాంతంలో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన పసుపులేటి అమర్‌నాథ్‌ అలియాస్‌ అమర్‌ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తనకు వివాహమైన విషయం చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలాకొంతకాలం ప్రేమ కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరూ సహజీవనం చేయసాగారు. 
 
పైగా, అతడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేది. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. అమర్‌కు వివాహం అయిందని, కుమారుడు ఉన్నాడని కొద్ది రోజుల తర్వాత ఆమెకు తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. అమర్‌ చేసిన మోసాలను అతడి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరింది. వారు అతడికే వత్తాసు పలికారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా నిందితుడు మాత్రం పత్తాలేకుండా పారిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments