హైదరాబాద్ చిరుత పట్టుబడింది

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (20:42 IST)
హైద‌రాబాద్‌ శివారులో కొన్ని నెలలుగా ఓ చిరుత అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలోనూ చిరుత రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు. చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. 
 
దీంతో గత అర్ధరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  చిరుత పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆసక్తికరంగా డార్క్ డేంజరస్ హారర్ థ్రిల్లర్ ప్రీ లుక్ పోస్టర్‌‌

Arya: క్రిమినల్స్ అంతా వారణాసిలోనే వున్నారు : కథానాయకుడు ఆర్య

Raka: రాకా లుక్ కోసం రోజూ నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని వెచ్చిస్తోన్న అల్లు అర్జున్‌

VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments