Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీటిని వృధా చేసిన వ్యక్తికి లక్ష జరిమానా.. హైదరాబాద్ అధికారుల నిర్ణయం

Advertiesment
నీటిని వృధా చేసిన వ్యక్తికి లక్ష జరిమానా.. హైదరాబాద్ అధికారుల నిర్ణయం
, గురువారం, 1 అక్టోబరు 2020 (09:39 IST)
నీరు వృధా చేసిన ఓ ఇంటి యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రోడ్డు మీదకు వెళ్ళేలా నీటిని వదిలి, నిర్లక్యంగా వ్యవహరించిన యజమానికి భారీ జరిమానా వేశారు.

గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్ యజమాని … తమ సెల్లార్‌ లోకి చేరిన నీటిని మోటర్ సర్వీస్ ద్వారా రోడ్డుపైకి వదలాడు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ కు అధికారులు రూ. లక్ష ఫైన్ వేశారు.
 
గతంలో కూడా ఆ అపార్ట్ మెంట్ యజమాని ఇదే మాదిరిగా నిర్లక్యంగా వ్యవహరించాడని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.

అయితే ఇలాగే ఎన్ని సార్లు చెప్పినా ఆ యజమాని  వినిపించుకోకుండా నీటిని రోడ్డుపైకే వదులుతుండడంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుండడం, బైకులు స్కిడ్ అయి పడిపోతుండడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

దీంతో… సీరియస్ అయిన జోనల్ కమీషనర్ రవికిరణ్ ఆ భవన యజమానికి రూ. లక్ష జరిమానా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో నేటి నుంచి బోటింగ్