కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలను మణిపూర్ ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలకు మించి వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా విధిస్తారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు పాటించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూలు చేస్తారు.
ఆ రాష్ట్ర హోంశాఖ ఈ మేరకు డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,360 మందికి కరోనా సోకగా 22 మంది మరణించారు.