Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విషాదం... ఏఎస్ఐ మృతి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (10:42 IST)
హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మహిపాల్ కన్నుమూశారు. 
 
ఈ నెల 27వ తేదీన శనివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఆయన్ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన తుది శ్వాస విడిచారు. 
 
నిజాంపేట్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో వస్తున్న సృజన్ అనే యువకుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసులను చూసి వేగంగా వెనక్కు మళ్లే సమయంలో వెనుక ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. 
 
మళ్లీ వెంటనే ముందుకు రానివ్వడంతో అక్కడున్న హోంగార్డుకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సృజన్‌కు ఆల్కహాల్ టెస్టు చేయగా 170 రీడింగ్ వచ్చింది. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి స్టేషన్‌కు సమాచారమిచ్చారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి పెట్రోలింగ్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను విషయం అడిగి తెలుసుకుంటుండగా.. అటుగా వస్తున్న మరో కారు ఏఎస్సై మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది మహిపాల్ రెడ్డిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డి రాత్రి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments