Webdunia - Bharat's app for daily news and videos

Install App

25మంది జోధ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థులకు పాజిటివ్.. మహారాష్ట్ర సీఎం భార్యకు కూడా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (10:21 IST)
రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌లో కరోనా వైరస్ కోరలు చాచింది. ఐఐటీ క్యాంపస్‌లో మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 25మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో క్యాంపస్‌లోని జీ 3 బ్లాక్‌ను అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.
 
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విద్యార్థులందరినీ సూపర్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్యాంపస్ రిజిస్ట్రార్ అమర్‌దీప్ శర్మ స్పష్టం చేశారు.
 
మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే మంగళవారం కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మార్చి 22వతేదీన రాత్రి కరోనా బారిన పడిన రష్మీ ఠాక్రే ఇన్నాళ్లు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గతంలో సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.
 
కరోనా బారిన పడిన సీఎం భార్య రష్మీ ఠాక్రే ప్రభుత్వం ఆధీనంలోని జేజే ఆసుపత్రిలో మార్చి 11వతేదీన కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా టీకా వేయించుకున్నా రష్మీఠాక్రేకు కరోనా సోకింది. రష్మీఠాక్రే శివసేన మౌత్ పీస్ సామ్నాకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments