నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి పాసైతే చాలు.. రైల్వేలో జాబ్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (10:03 IST)
నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్. పదో తరగతి పాసైన వారికి మంచి అవకాశం తలుపు తట్టింది. నార్త్ సెంట్రల్ రైల్వే పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
 
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు ఎన్సీవీటీకి అనుబంధం పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి గమనించండి. అలానే దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
 
అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఫిట్టర్ విభాగంలో 286 పోస్టులు, వెల్డర్-11 పోస్టులు, మెకానిక్-84 పోస్టులు, కార్పెంటర్-11 పోస్టులు, ఎలక్ట్రీషియన్-88 పోస్టులు వున్నాయి. ఏప్రిల్ 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు https://www.mponline.gov.in/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments