Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా ఉందనీ.. ఆ కిరాతక భర్త ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (09:17 IST)
సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు తలెత్తడం సహజమే. కొన్ని క్షణాల్లో అవన్నీ సర్దుకునిపోతాయి. కానీ, ఇక్కడ ఆ మనస్పర్థలే ఓ వివాహిత దారుణ హత్యకు కారణమయ్యాయి. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన యోగి, అరుణ యువతీయువకులు ఆర్నెల్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మియాపూర్‌లో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం భార్య నల్లగా ఉండటమే. ఈ ఒక్క కారణంతో మంగళవారం సాయంత్రం ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం యోగి కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 
 
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. అయితే.. ప్రేమించిన యువతితోకాకుండా మేనకోడలితో పెద్దలు పెళ్లి చేయడంతో భార్యను యోగి వేధించసాగాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments