Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడి కోసం భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

Advertiesment
ప్రియుడి కోసం భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య
, సోమవారం, 17 ఆగస్టు 2020 (15:43 IST)
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ ప్రాంతమది. గణేష్ స్థానికంగా ఫోటో స్టూడియో పెట్టుకుని జీవిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం గాయత్రి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరి కాపురం బాగానే సాగిపోతోంది. అయితే ఇంటి పక్కనే ఉన్న యాసిన్ అనే యువకుడు గత మూడు నెలల నుంచి గాయత్రితో చనువుగా ఉంటూ వస్తున్నాడు. ఆమెకు ఇష్టమైన వస్తువులు కొనివ్వడం.. ఆమెను బయట తిప్పడం లాంటి చేస్తుండేవాడు.
 
కెమెరా షూట్ కోసం తన భర్త గణేష్ ఇంటి నుంచి వెళ్ళిపోగానే, గాయత్రి టిప్ టాప్‌గా రెడీ అయ్యి ప్రియుడితో కలిసి బయటకు వెళ్ళిపోయేది. దీంతో విషయం కాస్తా భర్తకు తెలిసింది. భార్యను మందలించాడు. కుటుంబం మొత్తం నాశనమవుతుందని హెచ్చరించాడు. అయితే ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడి కోసం భర్తను చంపేయాలనుకుంది. రెండు రోజుల క్రితం ప్రియుడి సహకారంతో నిద్రమాత్రలు కలిపిన అన్నం పెట్టింది భర్త గణేష్‌కు.
 
అతడు బాగా నిద్రమత్తులోకి జారుకోగానే భర్త గణేష్ మర్మాంగాన్ని కోసేసింది భార్య. ఆ తరువాత తలపై రోకలితో గట్టిగా కొట్టింది. ఇంటి నుంచి బయటకు వచ్చి గణేష్ మంచం నుంచి కిందపడిపోయి తలపగిలిందని చెప్పింది. వెంటనే బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
 
అయితే మంచం మీద నుంచి పడితే తలకు అంత దెబ్బ తగిలే అవకాశం లేదు. అందులోను మర్మాంగం కూడా కోసేసి ఉండటంతో ఆ విషయాన్ని వైద్యులు గుర్తించి పోలీసులకు తెలిపారు. గాయత్రిని గట్టిగా విచారిస్తే అసలు విషయం బయటపడింది. గాయత్రి ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సర్కారుపై విరుచుక పడ్డ చంద్రబాబు, ప్రధాని మోదీకి లేఖ