సీపీ సజ్జనార్ ఆదేశాలను ఖాతరు చేయని పోలీసులు... అందుకే హేమంత్ హత్య!!?

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:18 IST)
కులాంతర వివాహం చేసుకున్న హేమంత్, అవంతిలకు రక్షణ కల్పించాలని సీపీ సజ్జనార్ చందానగర్ పోలీసులను ఆదేశించారు. కానీ, వారు కొత్త దంపతులకు భద్రత కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా హేమంత్‌ను కులోన్మాదం హత్య చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యోదంతానికి కులోన్మాదమే కారణమని సైబరాబాద్‌ పోలీసులు తేల్చారు. ఈ మేరకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేంధర్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
 
అయితే, హేమంత్‌ - అవంతి వ్యవహారంలో చందానగర్‌ పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. కొత్త దంపతులు రక్షణ కోరుతూ తనను కలిశాక సీపీ సజ్జనార్‌ చందానగర్‌ పోలీసులకు ఫోన్‌చేసి భద్రత కల్పించాలని ఆదేశించారు. అవంతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. కానీ, ఈ  వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 
 
పెళ్లయిన వారం రోజులకు అవంతి, హేమంత్‌లను కౌన్సెలింగ్‌ కోసమని పిలిచిన పోలీసులు.. అక్కడ అవంతి తల్లిదండ్రులకే వత్తాసు పలికారు. లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్‌రెడ్డిలు పోలీసుల ముందే హేమంత్‌, అతడి తల్లిదండ్రులను దుర్భాషలాడుతున్నా వారించలేదు. 'మీరు ఎలా బతుకుతారో చూస్తాం' అంటూ హెచ్చరించడంతో.. తమకు ప్రాణహాని ఉందంటూ హేమంత్‌ కుటుంబం అదే రోజు ఫిర్యాదు చేయగా.. దానిపట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments