Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా ప్లాన్‌తో మట్టుబెట్టాడా? ప్రభాకర్‌రెడ్డే హంతకుడా?

ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో వెలుగు చూసిన ఐదుగురి ఆత్మహత్యల వెనుకదాగివున్న మిస్టరీని పోలీసులు ఛేదించలేక పోతున్నారు. అరకొర పరిజ్ఞానమున్న ప్రభాకర్‌ రెడ్డిని వైకుంఠపాళిలా ఉండే షేర్‌ట్రేడింగ్‌ నిట్

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (11:57 IST)
ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో వెలుగు చూసిన ఐదుగురి ఆత్మహత్యల వెనుకదాగివున్న మిస్టరీని పోలీసులు ఛేదించలేక పోతున్నారు. అరకొర పరిజ్ఞానమున్న ప్రభాకర్‌ రెడ్డిని వైకుంఠపాళిలా ఉండే షేర్‌ట్రేడింగ్‌ నిట్టనిలువునా ముంచేసిందా? అతడి మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన బంధువులు డబ్బుకోసం ఒత్తిడి తేవడంతో ప్రభాకర్ రెడ్డి తట్టుకోలేక పోయాడా? ప్రభాకర్‌రెడ్డిని సొంత కొడుకుగా భావించి అపార నమ్మకంతో చిన్నమ్మ లక్ష్మికి కూడా మోసపోయిందా? వీరి ఒత్తిడిని భరించలేక ప్రభాకర్ రెడ్డి ఓ ప్లాన్ ప్రకారం నలుగురిని హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్యకు పాల్పడిన ప్రభాకర్‌రెడ్డి పక్కా ప్లాన్‌తో తన భార్య, బిడ్డతోపాటు చిన్నమ్మ, ఆమె కూతురును మట్టుబెట్టాడని భావిస్తున్నారు. ఒకవేళ వారికి విషయం తెలియకుండా కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ప్రాణాలు తీసుంటే ప్రభాకర్‌రెడ్డిని హంతకుడిగా భావించాల్సి వస్తుందని అంటున్నారు. నలుగురిని హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించే అవకాశముంది. మొత్తం సంఘటనలో మూడో వ్యక్తి సంబంధంపై పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిజంగా అప్పుల్లో కూరుకుపోతే ప్రభాకర్‌రెడ్డి తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకునే అవకాశముంది. కానీ చిన్నమ్మ, ఆమె కూతురికి విషం ఇవాల్సిన అవసరమే అంతు చిక్కడం లేదు.
 
చిన్నమ్మ కుటుంబంపై ఏమైనా అక్కసు పెంచుకున్నాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు లభించిన తీరు కూడా పోలీసులను ఆశ్చార్యానికి గురి చేస్తున్నది. వాస్తవానికి ఆత్మహత్యకు యత్నిస్తే అందరూ కారులోనే చేసుకోవచ్చు. కానీ మహిళల మృతదేహాలు రోడ్డు పక్క పొదల్లోకి ఎందుకు లాక్కెళ్లాడు? తిరిగి కొడుకుతో కిలోమీటరు దూరం ప్రయాణించి, రింగ్‌రోడ్డు బ్రిడ్జి కింద ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? చనిపోయిన వారిని కారులోంచి దింపినప్పుడు కొడుకు వర్షిత్‌ బతికే ఉన్నాడా? అసలు విష ప్రయోగం, ఆత్మహత్యలు ఏ సమయంలో జరిగాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతికేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments