రిటైర్డ్ ఉద్యోగికి రూ.21 లక్షలు టోకరా?

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:30 IST)
పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బులతో శేష జీవితంలో ఆసరాగా ఉంటాయని భావించాడు. బీమాతో లైఫ్‌కు ధీమా ఉంటుందని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి వద్ద నుంచి రూ.21లక్షలు దోచేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బాధితుడు రైల్వేలో టెక్నికల్‌ విభాగంలో పనిచేసి రిటైర్డు అయ్యాడు. మూడు నెలల కిందట బాధితుడికి ఫోన్‌ చేసి.. తాము ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ నుంచి మాట్లాడుతున్నాని చెప్పి రూ.53 వేల విలువైన పాలసీని చేయించారు. తర్వాత ఫోన్‌ చేసి ఆ పాలసీ కంటే ప్రీమియం ఎక్కువగా వచ్చేది మరొకటి ఉందని, మీకు త్వరగా పాలసీ డబ్బులు వస్తాయంటూ నమ్మించారు.
 
తాము చెప్పినట్లు పన్నులు చెల్లిస్తే చాలు.. సదరు పాలసీకి రావాల్సిన డబ్బులు భారీగా వెంటనే ఇప్పిస్తామంటూ బోల్తా కొట్టించారు. ఇలా వారి మాటలు విన్న బాధితుడు తనకు త్వరగా ఇన్సూరెన్స్‌ నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డాడు. 
 
ఆ విశ్రాంత ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులను మూడు నెలల కాలంలో 8 బ్యాంకు ఖాతాల్లో రూ.21 లక్షలు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు డిపాజిట్‌ చేశాడు. తీరా ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గ్రహించి బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments