Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీరా అపార్ట్‌మెంట్‌లో ఫ్రిజ్‌లో శవం... ఎక్కడ?

Advertiesment
తీరా అపార్ట్‌మెంట్‌లో ఫ్రిజ్‌లో శవం... ఎక్కడ?
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (05:39 IST)
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరం నేరాలు ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. అమ్మాయిలకు, మహిళలకు ఏమాత్ర చివరకు వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఈ క్రమంలో తాజాగా భాగ్యనగరిలో మరో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని చంపిన గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. 
 
అయితే, ఇంటి నుంచి రోజులు గడిచేకొద్ది దుర్వాసన వస్తుండంటంతో.. అపార్ట్‌మెంట్ యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ఈ విషయం బయటపడింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రెహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో ఈ సంఘటన జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తీరా అపార్ట్‌మెంట్‌లో 38 ఏళ్ల సిద్దిఖ్ అహ్మద్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. ఈయన టైలర్‌గా పనిచేసుకుంటూ జీవిస్తున్నడాు. ఈయన్ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచి బయట తాళం వేసి వెళ్లిపోయారు. 
 
రోజులు గడుస్తున్న కొద్ది ఆ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్ యజమానికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి పరిశీలించారు. ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన పోలీసులు.. తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. 
 
ఇది సిద్దిఖ్‌‌దిగా గుర్తించారు. ఇదిలాంటే.. రెండు రోజుల క్రితమే సిద్దిఖ్ భార్య రుబీనా తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే గొడవ పడి వెళ్లిందా? లేక ఎవైనా గొడవలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్.. పేరేంటో తెలుసా? ఎన్-440 రకం