Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడలిని మామ గదిలోకి తోసి తలుపులేసిన అత్త, భర్త

Advertiesment
కోడలిని మామ గదిలోకి తోసి తలుపులేసిన అత్త, భర్త
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (17:28 IST)
మెట్టినింటికి వచ్చిన కోడలిని కూతురితో సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత అత్తమామలపై ఉంటుంది. ముఖ్యంగా భర్త ఆమెను వేయికళ్లతో కాపాడుకుంటూ వందేళ్ళు ఆమెతో కలిసి జీవించాలి. అలాంటిది ముగ్గురు కలిసి అతి దారుణంగా కోడలిని చిత్రహింసలకు గురిచేశారు. ఎవరూ చేయని విధంగా పశువులా ప్రవర్తించాడు మామ. చిత్రవధను అనుభవించిన ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది.
 
ఇటార్సీ ప్రాంతానికి చెందిన కమల అనే యువతి రెండురోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చిన వెంటనే నా భర్త నా పక్కన పడుకోలేదు. 
 
మరుసటి రోజు నేను స్నానం చేస్తుండగా మా అత్త వచ్చింది. తలుపులు తీయమంది. అత్తే కదా తలుపులు తీశాను. అర్థనగ్నంగా ఉన్న నన్ను ఒళ్ళంతా తడిమింది. ఈ విషయం నా భర్తకు చెప్పా. నీ కన్యత్వాన్ని పరీక్షిస్తుందని చెప్పాడు. ఊరుకున్నా.
 
మరుసటి రోజు మా మామ బెడ్రూం క్లీన్ చేయమని చెప్పారు. లోపల మామ పడుకుని ఉండగా నా భర్త, అత్త ఇద్దరూ కలిసి నన్ను లోపలికి నెట్టి తలుపులకు గడియ పెట్టారు. దీంతో మా మామ రెచ్చిపోయాడు.. పశువులా నాపై పడి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెప్తే పుట్టింటికి పంపేస్తానన్నారు. నా భర్త శాడిజం ఎన్నో రోజులుగా గమనిస్తూ తట్టుకోలేకపోతున్నా.. అందుకే మీకు ఫిర్యాదు చేస్తున్నానంటూ పోలీసులకు ఆశ్రయించింది బాధితురాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలోని తమ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఖర్చులను భరించనున్న ఓయో