Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో బాలికలపై ఆటో డ్రైవర్ అకృత్యాలు: ఆటో డ్రైవర్లను నమ్మి పిల్లల్ని స్కూళ్లకు పంపొద్దు..!!

ఆటో డ్రైవర్లను నమ్మి పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారా? ఇకపై జాగ్రత్త పడండి. బస్సుల్లో పిల్లలు స్కూలు నుంచి రావడం కష్టమవుతుందని... ఆటో పెట్టేశాంగా.. ఇక హాయిగా ఉండొచ్చు అనుకుని చాలామంది తల్లిదండ్రులు రిల

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (16:36 IST)
ఆటో డ్రైవర్లను నమ్మి పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారా? ఇకపై జాగ్రత్త పడండి. బస్సుల్లో పిల్లలు స్కూలు నుంచి రావడం కష్టమవుతుందని... ఆటో పెట్టేశాంగా.. ఇక హాయిగా ఉండొచ్చు అనుకుని చాలామంది తల్లిదండ్రులు రిలాక్స్‌గా ఉంటారు. అలాంటివారు మీరైతే ఇకపై మీ ఆటోడ్రైవర్లపై ఓ కన్నేసి ఉంచండి. ఎందుకంటే.. భాగ్యనగరంలో ఓ రేపిస్ట్ అయిన ఆటోడ్రైవర్ బాగోతం బయటపడింది.
 
కృష్ణ అనే ఆటోడ్రైవర్ చేసిన దురాగతాలకు పోలీసులే షాక్ తిన్నారు. హైదరాబాదులోని అమీర్‌ పేటలో ఆటో డ్రైవర్ బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కృష్ణ (ఆటోడ్రైవర్) ఇంటిని దాటుకునే వెళ్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణ తన చెల్లి పిలుస్తోందని లోపలికి పిలిచి ఆమె నోటికి ప్లాస్టర్ వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెబితే చంపుతానని బెదిరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ బాలిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
కాగా.. స్కూల్ పిల్లలను దింపే ఆటోకు డ్రైవర్‌గా పనిచేసేవాడు. పిల్లలను స్కూల్లో దింపినట్టే దింపి మధ్యాహ్నం స్కూల్లో లంచ్ బెల్ కొట్టగానే అతని ఆటోలో ఎక్కిన బాలికలను మాయమాటలతో నమ్మించేవాడు. ఆపై తన ఇంటికి తీసుకెళ్లి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. 
 
తాను చేస్తున్న అకృత్యాన్ని వీడియో తీసి బెదిరించేవాడు. ఎప్పుడుపడితే అప్పుడు బాలికలు రాకపోతే.. వీడియోను నెట్లో పెట్టేస్తానని బెదిరించేవాడు. దీంతో బాలికలు భయపడి తల్లిదండ్రులకు చెప్పేవారు కాదు. అయితే బుధవారం ఆటో డ్రైవర్‌చే లైంగిక వేధింపులకు గురైన బాలిక ఈ కీచక చర్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం