Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్: మ‌ంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (17:21 IST)
తిల‌క్‌న‌గ‌ర్ యూపీహెచ్‌సీలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కే టీకా ఇస్తున్నారు.
 
ప్ర‌ధాని మోదీ సూచ‌న మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌స్తుతం టీకా తీసుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు టీకా తీసుకుంటారు. కొవాగ్జిన్ టీకా హైద‌రాబాద్‌లో త‌యారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. సుర‌క్షిత‌మైన టీకాల‌ను హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచానికి అందిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌పంచంలో వినియోగించే ప్ర‌తి మూడు వ్యాక్సిన్‌ల‌లో ఒక వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచి ఉత్ప‌త్తి అయిందే ఉంటుంద‌ని పేర్కొన్నారు.
 
టీకాల ఉత్ప‌త్తిలో ప్ర‌పంచానికి టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్ మారింద‌న్నారు. టీకాతో క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌లంతా బ‌య‌ట‌ప‌డుతార‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. టీకా విష‌యంలో ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్రాధాన్య‌త క్ర‌మంలో అంద‌రికీ టీకాలు వేస్తార‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments