హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని.. యూటీ చేసే ఆలోచన.. కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:44 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
 
అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. శనివారం నాడు లోక్‌సభలో జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రసంగించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ను యూటీ చేసినా చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై తాజాగా హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి స్పందించారు. యూటీ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేలోపే అసదుద్దీన్ లోక్‌సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్‌లో‌ ఉన్న హైదరాబాద్‌‌ను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments