Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపి రేప్ చేసిన వంట మనిషి!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (09:14 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వంటమనిషి పాడుపనికి పాల్పడ్డాడు. బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపి 19 యేళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, లాలాపేటలో నివాసముంటున్న 19 యేళ్ళ యువతి.. బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పీర్జాదిగూడకు చెందిన రవి (40) అనే వ్యక్తి వండ మనిషిగా పని చేస్తున్నాడు. 
 
అయితే, ఆ యువతిపై కన్నేసిన రవి.. ఆమెకు బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. అది సేవించిన ఆ యువతి అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేశారు. ఈ క్రమంలో ఆ యువతి గర్భందాల్చడంతో శరీరంలో మార్పులు సంభవించాయి. 
 
దీంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. గురువారం ఆ యువతి కాచిగూడ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. రవిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments