Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ.. మమ్మీ... అంకుల్‌తో వెళ్లిపోతున్నా... ఆయన్ను వదిలివుండలేను..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (15:27 IST)
హైదరాబాద్ నగరంలో కుంట్లూర్‌కు చెందిన బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 18వ తేది అదే గ్రామానికి చెందిన ఓ రియల్‌ వ్యాపారి వెంట వెళుతున్నట్లు ఒక ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్లింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ రోజే హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుంట్లూర్‌లో నివాసం ఉండే 18 యేళ్ల బాలిక హయత్‌నగర్‌‌లోని ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మీడియట్‌ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పి. యాదయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతని కారులో ఎక్కి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతవరకు తిరిగి ఇంటికి రాక పోవడంతో భయమేస్తోందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక సిబ్బందిని వివిధ ప్రాంతాలకు పంపినట్లు సీఐ సురేందర్‌ తెలిపారు. 
 
కాగా, ఆ అమ్మాయి రాసిన లేఖలో.. ఆ అంకుల్‌ను వదిలి వుండలేనని, అతనితో తాను సంతోషంగా ఉంటానని తనకు అనిపిస్తుదని పేర్కొంది. పైగా, తామిద్దరం చాలా దగ్గర అయ్యాం, ఎంతలా అంటే... నేను ఇపుడు గర్భందాల్చివున్నాను అని పేర్కొంది. ఇపుడు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకే అంకుల్‌తో కలిసి వెళ్లిపోతున్నా. మా యిద్దర్ని అర్థం చేసుకో. సారీ మమ్మీ... ప్లీజ్ అర్థం చేసుకో అంటూ ఓ లేఖ రాసిపెట్టింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments