Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో టీకా వేయించుకున్న వెంకయ్య.. నాకు వ్యాక్సిన్ అక్కర్లేదన్న ఖర్గే

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (14:46 IST)
దేశంలో కరోనా రెండో దశ డ్రైవ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ డ్రైవ్‌లో 60 యేళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారు. ఇందులోభాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రం చెన్నైలో టీకా వేయించుకున్నారు. 
 
గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.. సోమవారం ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఫొటోలతో సహా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య తెలిపారు. 
 
అర్హులైన వారందరూ కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకుని కొవిడ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వివిధ దేశాలకు మన దేశం నుంచి కరోనా వ్యాక్సిన్‌ సరఫరా అవుతుండటం భారతీయుడిగా గర్విస్తున్నన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్‌ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు.
 
మరోవైపు, కాంగ్రెస్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత అయిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాల్సింది వృద్ధుల‌కు కాదు.. యువ‌త‌కన్నారు. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారా అని ప్ర‌శ్నించ‌గా.. నా వ‌య‌సు ఇప్ప‌టికే 70 దాటింది. వ్యాక్సిన్‌ను ముందుగా ఎక్కువ జీవిత‌కాలం ఉన్న యువ‌తీయువ‌కులు ఇవ్వాలి. నేను మ‌హా అయితే మ‌రో 10, 15 ఏళ్లు ఉంటాను అని ఖ‌ర్గే అనడం గ‌మ‌నార్హం. 
 
మ‌రోవైపు ఇప్ప‌టికే కొవిడ్‌-19 బారిన ప‌డిన హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌.. త‌న‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని అన్నారు. కొవిడ్ వ‌చ్చిన త‌ర్వాతో త‌న‌లో యాంటీబాడీల సంఖ్య 300 వ‌ర‌కూ ఉన్న‌ద‌ని, ఇది చాలా ఎక్కువ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు త‌న‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. ఈయ‌న గ‌తేడాది నవంబ‌ర్ 20న కొవాగ్జిన్ ట్ర‌య‌ల్ డోస్ తీసుకున్నారు. అయితే డిసెంబ‌ర్ 5న క‌రోనా బారిన ప‌డిఆసుప‌త్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments