Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్రలో ఈ రోజు : అభినందన్ క్షేమంగా స్వదేశానికి తిరిగిరాక..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (14:08 IST)
మార్చి ఒకటో తేదీకి ఓ ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ మిగ్‌-21లో దూసుకెళ్లిన భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో అతన్ని పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత 2019లో సరిగ్గా ఇదే రోజున అంటే మార్చి ఒకటో తేదీన విడిచిపెట్టారు. 
 
పాకిస్థాన్‌ సరిహద్దులోని వాఘా వద్ద భారతీయ అధికారులకు భద్రంగా అప్పగించింది. దాంతో దాదాపు 58 గంటల నిరీక్షణ అనంతరం అభినందన్‌ ప్రాణాలతో తిరిగి రావడం పట్ల ఆయన కుటుంబసభ్యులతోపాటు భారత వైమానికదళం సంతోషంతో పండుగ చేసుకున్నాయి. అభినందన్‌ సాహసానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను వీర చక్ర అవార్డుతో సత్కరించింది.
 
అంతకు మూడు వారాల ముందు జమ్ముకాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయిపై ఉగ్రదాడి జరుగ్గా 40 మంది సైనికులు చనిపోయారు. రెండు వారాల తర్వాత 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌పైకి దూసుకెళ్లిన భారత విమానాలు బాలాకోట్‌లోని ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశాయి. 
 
రాత్రి వేళ అకస్మాత్తుగా భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ విమానాలు నియంత్రణ రేఖకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌లోకి దూసుకెళ్లి జైష్ ఉగ్రవాద స్థావరాన్ని బూడిద చేశాయి. ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యం వెల్లడించింది. 
 
బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడితో పాకిస్థాన్‌ చాలా కోపంగా ఉన్నది. మరుసటి రోజు 10 యుద్ధ విమానాలను పంపి పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు దిగింది. పాకిస్థాన్‌ విమానాలను వెంబడించి తరిమి కొట్టేందుకు మిగ్‌-21 విమానంలో దూసుకెళ్లిన అభినందన్‌.. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని ఒకదాన్ని కూల్చివేశాడు. 
 
తిరిగి వస్తుండగా దురదృష్టవశాత్తు ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ప్రాణాలతో బయటపడిన అభినందన్‌ను పాకిస్థాన్‌ సైనికులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అనంతరం నెత్తురుతో తడిసి ఉన్న ఆయన వీడియోలను పాకిస్థాన్‌ విడుదల చేసి కొన్నిరోజులపాటు భారతీయులను భయపెట్టింది. 
 
అభినందన్ విడుదలపై పాకిస్థాన్ చాలా డ్రామా ఆడింది. అయినప్పటికీ, భారత్‌ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం అభినందన్‌ వర్ధమాన్‌ను క్షేమంగా విడిచిపెట్టక తప్పలేదు. అమెరికా తయారుచేసిన ఎఫ్‌-16 అధునాతన యుద్ధ విమానాన్ని అభినందన్‌ కుప్పకూల్చివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments