Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చెల్లితో పెళ్ళి, మరో మహిళతో వివాహేతర సంబంధం, మనిషా? మృగమా?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (20:38 IST)
కామంతో కళ్ళు మూసుకుపోయాడు. పెళ్ళి చేసుకుని నలుగురు పిల్లలున్న భర్త, భార్య చెల్లెలిపై కన్నేశాడు. అదనపు కట్నం వేధింపులతో భార్యను పుట్టింటికి పంపేశాడు. పిల్లలను ఇంటికి తీసుకెళ్ళిపోయిన భార్యకు ఫోన్ చేసి కట్నం ఇవ్వకపోతే నీ చెల్లెలిని ఇచ్చి పెళ్ళి చేయాలన్నాడు. దీంతో వారి తల్లిదండ్రులు షాకయ్యారు. ఏం చేయాలో తెలియక చివరకు పెళ్ళి చేశారు. ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న యువతి కాపురానికి రానని భీష్మించుకు కూర్చుంది. దీంతో ఆ కామాంధుడు మరో మహిళను ఇంట్లో తెచ్చుకుని రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికాడు.
 
నిజామాబాద్ లోని విద్యుత్ నగర్ ప్రాంతమది. ఆర్మూర్ మండలం మగ్గిడికి చెందిన హారికకు, నిజామాబాద్ విద్యుత్ నగర్‌కు చెందిన గల్ఫ్ ఏజెంట్ క్రిష్ణకు గత 15 యేళ్ళ క్రితం వివాహం జరిగింది. కొంతకాంగా వీరి కాపురం సాఫీగానే సాగింది. వీరికి నలుగురు పిల్లలున్నారు. 
 
అయితే క్రిష్ణకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ అదనపు కట్నం కావాలంటూ భార్యను గత రెండు నెలలుగా వేధించడం మొదలుపెట్టాడు. ఇంటి నుంచి నెల క్రితం తరిమేశాడు. హారిక చెల్లెలు రాధపై కన్ను పడింది క్రిష్ణకు. ఇస్తే కట్నం ఇవ్వండి.. లేకుంటే నా భార్య చెల్లెలు రాధను ఇచ్చి వివాహం చేయండంటూ మామ, అత్తలను బెదిరించాడు.
 
డిగ్రీ పూర్తి చేసుకుని ఇంట్లో ఖాళీగా ఉన్న రాధ అందుకు ఒప్పుకోలేదు. పెద్ద కూతురు జీవితం నాశనం అవుతుందని బెంగబడ్డారు తల్లిదండ్రులు. మరోవైపు రెండో కుమార్తెకి పెళ్ళి చేసి కట్నం ఇచ్చి పంపించే స్తోమత లేకపోవడంతో చివరకు క్రిష్ణకు ఇచ్చే 15 రోజుల క్రితం గుట్టుగా వివాహం చేశారు. వివాహం జరిగిన తరువాత భర్త ఇంటికి వెళ్ళలేదు రాధ. తన అక్కను కూడా వెళ్ళవద్దని తేల్చి చెప్పింది. దీంతో క్రిష్ణ ఇద్దరు భార్యలు ఇంటికి రాకపోవడంతో ఒక మహిళను ఇంట్లోకి తెచ్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
విషయం తెలిసి ఇద్దరు భార్యలు ఇంటికి రావడంతో ఆ మహిళతో ఉన్నాడు భర్త. దీంతో ఇద్దరు కలిసి ఇంటి ముందే ధర్నాకు దిగారు. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రిష్ణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments