Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఆసుపత్రి బయట, భార్య వైద్యుడితో లోపల...

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:30 IST)
ఆమె వయస్సు 45 సంవత్సరాలు. వివాహం చేసేంత వయసుకు వచ్చిన కొడుకులు. అయితే భర్త తాగుడుకు అలవాటు పడ్డాడు. ఎంతకూ మానలేదు. ఎలాగైనా మాన్పించాలని ప్రయత్నించింది భార్య. ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. భర్త తాగుడు మాన్పించడానికి వెళ్లి వైద్యుడి మాయలో పడిపోయింది. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. 
 
హైదరాబాద్ రూరల్ లోని ఘట్‌కేసర్ ప్రాంతం. ఎన్ఎఫ్‌సీ నగర్‌కి చెందిన అంజయ్య టైలర్. అతని భార్య భవానీ హౌస్ వైఫ్. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు వయసు 24 యేళ్ళు, రెండవ కుమారుడి వయసు 22యేళ్ళు. పెద్ద కొడుకు ఆంధ్రప్రదేశ్‌‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
 
చిన్న కొడుకు తండ్రి దగ్గర టైలర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఉదయం నుంచి కష్టపడి పనిచేసిన డబ్బును అంజయ్య తాగుడికి ఖర్చు పెట్టేసేవాడు. దీంతో భవానీ, చిన్నకొడుకు ఇద్దరూ కలిసి అంజయ్య తాగుడును మాన్పించాలనుకున్నాడు.
 
స్థానికంగా ఉన్న ఆయుర్వేద వైద్యుడు సతీష్ దగ్గరకు తీసుకెళ్ళారు. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ చేస్తానని చెప్పాడు. అయితే ట్రీట్మెంట్ కన్నా ఆ వైద్యుడు భవానీపై ఎక్కువ ఫోకస్ పెట్టడం ప్రారంభించాడు. అసలే భర్తతో పీకల్లోతు అయిష్టంతో వున్న ఆమె కాస్తా వైద్యుడికి లొంగిపోయింది.
 
ఆసుపత్రికి తీసుకెళ్ళిన తరువాత భర్తను బయట కూర్చోబెట్టి వైద్యుడితో రాసలీలల్లో మునిగితేలేది భవానీ. ఇది కాస్త భర్తకు తెలిసేది కాదు. అయితే వైద్యుడికి బాగా దగ్గరైన భవానీ తాగుబోతు భర్తను ఎలాగైనా చంపేయాలనుకుంది. ఇదే విషయాన్ని వైద్యుడికి చెప్పింది. సరేనన్నాడు.
 
ఫుల్లుగా మద్యం సేవించిన భర్తను రోకలిబండతో కొట్టేందుకు ప్రయత్నించింది. అయితే మేల్కొన్న అంజయ్య గట్టిగా అరిచేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తేరుకుని దిండుతో ముఖంపై గట్టిగా మూసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత అతిగా మద్యం సేవించి చనిపోయాడని చిన్న కొడుకును, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది.
 
అంత్యక్రియలు చేసేద్దామని హడావిడి చేసింది. అయితే బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. భార్యను విచారిస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments