అన్నం తింటున్న భార్యను కొట్టిన భర్త, భవనం పైనుంచి దూకేసింది...

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (14:19 IST)
తాగుబోతు భర్త వేధింపులు భరించలేక.. ఏడాది వయస్సున్న కుమార్తెను ఒళ్లో పెట్టుకుని భవనంపై నుంచి దూకేసింది ఓ ఇల్లాలు. మూడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి అమాంతంగా కిందకు దూకడంతో ఏడాది పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి రెండు కాళ్లు విరిగి.. తల పగిలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 
 
అయితే భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని.. భార్యను, బిడ్డను కడతేర్చేందుకు అతనే భవనంపై నుంచి తోసేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు పరిశీలిస్తే ఛత్తీస్ ఘడ్‌కు చెందిన దామిని, యోగేష్ భార్యభర్తలు. రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ నాచారం మల్లాపూర్‌లో ఓ భవన నిర్మాణ పనులకు కూలీలుగా చేరారు. భర్త యోగేష్ తాపీ పని చేస్తుండగా భార్య దామిని కూలీ పని చేసేది. వీరికి ఏడాది వయస్సున్న పాప విద్య ఉంది. 
 
తాగొచ్చి భర్త యోగేష్ నిత్యం దామినిని శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. బిడ్డ కోసం కష్టాలన్నీ భరించింది ఈ ఇల్లాలు. రోజులాగే రాత్రి యోగేష్ ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు భోజనం పెట్టమని, భార్య పాపతో కలసి భోజనం చేస్తున్న సందర్భంలో భార్యను అకారణంగా బలంగా  కొట్టాడు. దీంతో భోజనం చేస్తున్న దామిని అన్నం పళ్లాన్ని అక్కడే వదిలేసి బిడ్డను తీసుకుని బిల్డింగ్ పైకి ఎక్కేసింది. బిడ్డను ఒళ్లో పెట్టుకుని మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. 
 
పెద్ద శబ్దం రావడంతో అక్కడున్న కూలీలు వచ్చి చూడగా.. అప్పటికే ఏడాది పాప విద్య చనిపోగా.. తల్లి దామిని రెండు కాళ్లు విరిగి.. తల పగిలి తీవ్ర గాయాలతో పడి కనిపించింది. అయితే భర్తే భార్యను, బిడ్డను తోసేసి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యోగేష్ పైన ఛత్తీస్‌ఘడ్‌లో పలు పోలీసు కేసులు ఉన్నాయని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి ఇక్కడ నివాసముంటున్నాడని చెప్తున్నారు తోటి కూలీలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments