రేవంత్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు : ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నట్టేనా?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (19:34 IST)
కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
గత 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌తో బేరాలు ఆడుతూ రేవంత్ ఓ వీడియోలో కనిపించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
 
టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ స్టీఫెన్ సన్‌ను రేవంత్ కోరిన సమయంలో, అక్కడ సంచుల్లో రూ.50 లక్షల నగదు ఉండడం ఆయనపై ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అని ఏసీబీ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేయడం తెలిసిందే. అయితే, ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయం అని పేర్కొంటూ, రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇదే అంశంపై రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు కాగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments