Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ స్టాగ్రామ్ లో భారీగా సంపాదిస్తున్న హీరో వెంకటేశ్ కుమార్తె

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:09 IST)
సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా వంటి వారు ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు కోట్లలో ఆదాయం పొందుతారంటే అతిశయోక్తి కాదు.

ఇటీవలే హాపర్ హెచ్ క్యూ అనే సంస్థ సెలబ్రిటీల ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత కూడా ఉండడం విశేషం.

హాపర్ హెచ్ క్యూ జాబితాలో వరల్డ్ వైడ్ గా అశ్రితకు 377వ స్థానం దక్కింది. అదే ఆసియాలో చూస్తే ఆమె 27వ స్థానంలో ఉంది. అశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో పోస్టుకు సుమారుగా రూ.29 వేలు లభిస్తాయట.

ఇంతకీ అశ్రిత పోస్టుల్లో ఉండేది కుకింగ్ వీడియోలు. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే అకౌంట్ తో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వంటల వీడియోలను పంచుకుంటుంది. ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ అకౌంట్ కు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

బిస్కట్లు, కేకులు, ఇతర స్నాక్స్ ఐటమ్స్ లో కొత్త రకాలను అశ్రిత సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంటుంది. అశ్రిత ప్రస్తుతం స్పెయిన్ లో ఉంటోంది. ఆమెకు రెండేళ్ల కిందట వినాయక్ రెడ్డితో వివాహం జరగ్గా, అప్పటి నుంచి స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో నివసిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments