Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (09:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే శనివారం ఉత్తర తెలంగాణాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.  అలాగే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతారణ డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. 
 
అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఇచ్చామని వెల్లడించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. 
 
మిగిలిన జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చామని ఆమె తెలిపారు. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌లో 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
 
12 లేదా 13న మరో అల్పపీడనంఈ నెల 12 లేదా 13న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు తూర్పు, పడమర ద్రోణి మరికొన్ని రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
 
వీటి ప్రభావంతో మధ్య, పశ్చిమ భారతం, ఏపీ, తెలంగాణల్లో అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments