Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత, పోలీసుల అదుపులోకి నిందితులు

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (22:32 IST)
గత కొద్ది నెలలుగా బాలీవుడ్లో కలకలం రేపుతూ వచ్చిన డ్రగ్స్ వివాదం కొందరు సినీ ప్రముఖులను వెలుగులోనికి తెచ్చింది. నేటి యువతరం డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాన్ని కోల్పోతున్నారు. ఎక్కువగా భాగ్యనగరంలో ఈ డ్రగ్స్ దందా కొనసాగడం అందర్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతున్నది.
 
ఈ నేపథ్యంలో హైదరాబాదులో భారీగా డ్రగ్స్ బయటపడటం వివాదాస్పదంగా మారింది. హైదరాబాదులో డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో సల్మాన్, అహ్మద్‌లను తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి 200 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
గోవా నుంచి హైదరాబాదుకు డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ పబ్‌లో మేనేజరుగా పనిచేస్తున్న సల్మాన్, 10 పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గోవా నుంచి అమ్మాయిలను రప్పించి వారి ద్వారా పబ్‌కు వచ్చే వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అమ్మాయిలతో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో సల్మాన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న 10 పబ్‌ల డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments