Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లబ్ రోగ్ పబ్ వద్ద పోకిరీల ఆగడాలు... జూ.ఆర్టిస్టులకు వేధింపులు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (09:57 IST)
హైదరాబాద్ నగరం జూబ్లీ రోడ్ నంబరు 36లోని క్లబ్ రోగ్ పబ్ వద్ద కొందరు జూనియర్ ఆర్టిస్టులను పలువురు పోకిరీలు అల్లరి చేశారు. ఓ యువతిని అసభ్యంగా వేధించడంతో పాటు ఆమె కారును కూడా వెంబడించారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ పోకిరీలను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారి వద్ద విచారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్న ఓ యువతి (28) మంగళవారం రాత్రి జూబ్లీ హిల్స్‌ రోడ్ నంబరు 36లోని క్లబ్ రోగ్ పబ్‌కు కొందరు స్నేహితులతో కలిసి వచ్చింది. అదే పబ్‌కు వాహిద్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. 
 
అయితే, పబ్ నుంచి కిందికి వచ్చిని జూనియర్ ఆర్టిస్ట్‌ పార్కింగ్ వద్ద కారు కోసం వేచి చూస్తుండగా, అక్కడికి వచ్చిన వాహిద్, అతని స్నేహితులు ఆమెను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఎంత రెచ్చగొట్టినా ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆమె కారు ఎక్కుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత ఆమె కారును వెంబడించారు. వారి వేధింపులు భరించలేని ఆ జూనియర్ ఆర్టిస్ట్... జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. టౌలీచౌక్‌కు చెందిన వాహిద్, అతడి స్నేహితులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments