అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. మెహందీ.. టాటూలకు నో.. 15 నిమిషాల ముందే?

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (17:08 IST)
అక్టోబర్ 16న అంటే ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 8.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేస్తారు. అంటే 10.15 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు.

అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ విధానంలో హాజరును నమోదు చేయనున్నారు. ఇప్పుడు నమోదుచేసే బయోమెట్రిక్‌ వివరాలను మెయిన్‌ పరీక్ష సమయంలో పోల్చి చూస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.  

మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌, వాచ్‌, కాలిక్యులేటర్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, రికార్డింగ్‌ పరికరాలను అనుమతించరు. అలాగే జ్యువెలరీ, షూ ధరించరాదు. చేతులు లేదా పాదాలకు మెహందీ, టాటూలు ఉండకూడదు. రాష్ట్రంలోని 1,019 కేంద్రాల్లో ఈ పరీక్షలు వుంటాయి.

గ్రూప్‌-1కు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో శుక్రవారం రాత్రి వరకు సుమారు 3.21 లక్షల మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్‌ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments