Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు సంగీత కచేరీ.. కోడలి అచ్చెరువు

CBN
Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (22:42 IST)
CBN
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ సిబిఎన్ కృతజ్ఞతా సభ నిర్వహించారు. 
 
హైటెక్ సిటీ, సైబర్ టవర్లు నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ సంగీత కచేరీ నిర్వహించారు. శని, ఆదివారాలు కావడంతో ఐటీ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కచేరీలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇందులో రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, సినీ నటుడు మురళీమోహన్, సినీ నిర్మాత బండ్ల గణేష్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.
 
సైబర్ టవర్ల నిర్మాణం, హైటెక్ సిటీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వీడియో రూపంలో ప్రదర్శించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం చంద్రబాబు నాయుడుపై ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించి అందరినీ ఉర్రూతలూగించారు.
 
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతూ కంటతడి పెట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయమని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించిన అతడిని జైల్లో పెడతారా? చంద్రబాబు కోసం చనిపోతానని, చంద్రబాబుకు ప్రాణం పోయాలని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు అంటే పేరు మాత్రమే కాదని, ఆ పేరుకు ఓ బ్రాండ్ అని బండ్ల గణేష్ అన్నారు.
 
చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని ఆయన కోడలు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. 52 రోజులపాటు ఆయన బయటలేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. గడిచే ప్రతి రోజూ చంద్రబాబు మద్ధతును రెట్టింపు చేస్తున్నట్టుగా ఉందని బ్రాహ్మణి అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments