Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురికి రెండో పెళ్లి చేయాలని మనవడిని చంపేసింది.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (22:40 IST)
కూతురికి రెండో పెళ్లి చేసేందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని అమ్మమ్మే కిరాతకురాలిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మే కిరాతకంగా చంపేసింది. సంగారెడ్డిలో అమానుష ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల బాలుడి అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. సొంత అమ్మమ్మే చిన్నారిని అమానుషంగా హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. సంగారెడ్డికి చెందిన యశ్వంత్(2) గురువారం కనిపించకుండా పోయాడు. 
 
కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే శుక్రవారం అనూహ్యంగా బిబ్బిలకుంట చెరువులో యశ్వంత శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన స్టైల్ లో విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
 
చిన్నారి యశ్వంత్ తండ్రి రెండేళ్ల కిందట మరణించాడు. భర్త చనిపోయిన కూతురికి మరో పెళ్లి చేయాలని ఆమె తల్లి భావించింది. అయితే మనవడు ఆమెకు అడ్డుగా కనిపించాడు. అంతే, మరో ఆలోచన చేయకుండా ఏ మాత్రం కనికరం చూపకుండా మనవడిని కిరాతకంగా చంపేసి చెరువులో పడేసింది. 
 
మరొకరి సాయంతో మనవడిని అమ్మమ్మే మట్టుబెట్టింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురు భవిష్యత్తు కోసమే తానిలా చేశానని నిందితురాలు చెప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments