Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని తీసుకొచ్చాడు, తాళి కట్టేద్దామనుకునేలోపు పిచ్చకొట్టుడు కొడుతూ...

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (13:08 IST)
ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. దీనితో ఇద్దరూ ఇళ్ల నుంచి పారిపోయి హైదరాబాదులోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే కాచిగూడలో తన కుమార్తెతో యువకుడు వున్నాడని తెలుసుకున్న యువతి బంధువులు వారిపై మెరుపుదాడి చేసి కారులో కిడ్నాప్ చేసి దారి పొడవునా ఇరువురికీ దేహశుద్ధి చేసారు.
 
వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా బండగొండ గ్రామానికి చెందిన 23 ఏళ్ల శివశంకర్ గౌడ్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఐతే వీరివురి కులాలు వేరు కావడంతో పెద్దలు అడ్డు చెప్పారు. దీనితో ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుందామని ఇద్దరూ ఇంటి నుంచి వచ్చేసారు. కానీ యువతి తరపు బంధువులు వారి ఆచూకి కనుగొని కారులో కిడ్నాప్ చేశారు.
 
నగరంలోని వివిధ రోడ్లలో తిప్పుతూ అతడిపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేసారు. చివరికి అతడిని పోలీసులకు అప్పగించి యువతిని తమతో తీసుకెళ్లిపోయారు. కాగా యువతి స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments