Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై పోలీస్ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (13:03 IST)
ముంబైకు చెందిన పోలిస్ వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో చేసిన డ్యాన్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 
ముంబైకు చెందిన అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. 38 ఏళ్ల అమోల్ యశ్వంత్ కాంబ్లే ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2004లో పోలీస్ ఉద్యోగంలో చేరారు. 
 
అతనికి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటూ డ్యూటీ పూర్తి అయ్యాక ఖాళీ సమయాల్లో డ్యాన్సులు వేస్తుంటారు. నైగావ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించే కాంబ్లే ‘అప్పు రాజా’ సినిమాలోని ‘ఆయా హై రాజా’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. 
 
కాంబ్లే చేసిన ఈ డ్యాన్స్‌కు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోలీసు డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తన వీడియో అంత వైలర్ అవుతుందని ఊహించని కాంబ్లే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడియో చేయడం వెనుక సామాజిక కోణం కూడా ఉందని తెలిపారు. 
 
డ్యూటీలో ఉన్న ఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో ఈ డ్యాన్ చేశాం అనీ.. ఆ ఉద్దేశ్యంతోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం’ అని తెలిపారు. మా అన్నయ్య కొరియోగ్రాఫర్. నేను పోలీసు ఉద్యోగంలో చేరడానికి ముందు అతనితో కలిసి కొన్ని డ్యాన్స్ షో లు కూడా చేశానని తెలిపారు. 
 
ఒక పోలీసుగా శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను రక్షించడం నా డ్యూటీ. కానీ వీక్లీ ఆఫ్‌ సమయాల్లో నా పిల్లలు, నా సోదరి పిల్లలతో కలిసి ఇలా డ్యాన్స్ చేస్తుంటాం. అది మాకు చాలా ఇష్టమైన పని అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments