Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఆడుకుంటున్న చిన్నారి అపహరణ

Webdunia
గురువారం, 6 జులై 2023 (11:17 IST)
హైదరాబాద్ నగరంలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అపహరణకుగురైన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మేడ్చెల్ పట్టణంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటిదాకా ఆడకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యమైందంటూ వారు కన్నీటిపర్యంతమైయ్యారు. 
 
పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, బుధవారం పెద్ద అంబర్ పేట్ హైవే చెక్ పోస్ట్ వెలుగు చూసిన బాలిక కిడ్నాప్ ఉదంతం నగర వాసులను ఉలిక్కిపడేలా చేసింది. 
 
బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేయగా వారి నుంచి కష్టపడి తప్పించుకున్న బాలిక వీధిలోనిలబడి వచ్చే పోయో వారి సాయం కోసం అర్థించింది. బాలిక దుస్థితి చూసినా ఒక్కరూ స్పందించకపోవడంతో చెలించిపోయిన ఓ చేయూతనందించాడు. 
 
హిజ్రా వద్ద ఫోన్ తీసుకున్న బాలిక తన అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో, బాలిక కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుల నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments