ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగిస్తుంది. ఈ దర్యాప్తులో ఊహించని మలుపు తిరిగింది. బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశ్యపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సీబీఐ ఆ కోణంలో విచారణ చేపట్టారు.
అదేసమయంలో జేఈ అమీర్ ఖాన్ ఉండే అద్దె ఇంట్లో విచారించి, ఆ ఇంటికి సీబీఐ సీలు వేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. దాదాపు 280 మంది చనిపోయిన ఈ ప్రమాదంపై సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జేఈ ఇంటికి సీల్ వేయడం సహా దర్యాప్తులో వెలుగు చూస్తున్న విషయాలతో బాలాసోర్ రైలు ప్రమాదం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.